NZB: ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు సాలూర మండలానికి చెందిన లింబూరి లక్ష్మణ్ (తేజ) ఆదివారం బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సాలూరు మండల అధ్యక్షుడు రావుబా గంగాధర్, ప్రధాన కార్యదర్శి దిలీప్, సుభాష్, సీనియర్ నాయకులు గోనె ప్రవీణ్, భాస్కర్ పాల్గొన్నారు.