SKLM: ఆమదాలవలస పట్టణంలో ఆదివారం అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో కే. రాములు హాజరయ్యారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవలు స్ఫూర్తిదాయకం అని అన్నారు.