BDK: చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ ఎస్బీఐ బ్యాంక్ నందు విద్యానగర్ కాలనీకి చెందిన దేశభోయిన శ్రీనివాస్ స్కూల్ బస్ క్లీనర్‌గా పనిచేస్తున్నారు. మూడు నెలల క్రిందట ఎస్బీఐ బ్యాంక్‌లో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 500రూపాయలు చేశారు. అకాల మృతి చెందిన శ్రీనివాస్‌కు తన భార్య నామిని ఉండడంతో ఏజీఎం సత్యనారాయణ చేతుల మీదుగా 10 లక్షల రూపాయల చెక్కును ఆదివారం అందజేశారు.