SRPT: దసరా పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి ప్రయాణికుల తాకిడి పెరగడంతో సరిపోను బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండుగ ముగియడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు, తిరుగు ప్రయాణం పట్టడంతో ప్రయాణికులు గంటలు తరబడి బస్సుల కోసం బస్టాండ్లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.