NLG: నల్గొండ మండలం కొత్తపల్లిలోని డీ-37 కాలువలో జారిపడి మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అదే సమయానికి అటుగా వెళుతున్న గ్రామస్తులు పెరిక రాము, పాలడుగు నాగార్జున ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దురదృష్టవశాత్తు ఆమె అప్పటికే మృతి చెందింది. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.