KDP: పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగులోని రూ. 95 వేలు నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన ఇవాళ చోటుచేసుకుంది. మార్కాపురం గ్రామానికి చెందిన గురుభారతి అనే మహిళ బద్వేలులో రూ. 95 వేలు తీసుకుని మార్కాపురానికి తిరిగి వెళ్లేందుకు గిద్దలూరు బస్సు ఎక్కుతున్న సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు బాధితురాలు తెలిపారు.