KRNL: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం ఎరులై పారుతోందని, బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగాయని ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు విమర్శించారు. జిల్లా కార్మిక కర్షక భవన్లో జరిగిన మహిళా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది కొనసాగితే మహిళలు తిరుగుబాటుకు దిగుతారని హెచ్చరించారు.