RR: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సగర భగీరథ మహర్షి విగ్రహాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భగీరథ మహర్షి పరోపకారానికి, దీక్షా, సహనానికి ప్రతిరూపం అనీ, ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా అనుకున్నది సాధించారని కొనియాడారు.