SKLM: సంతబొమ్మాళి మండలం పిట్టవానిపేట సముద్రతీరానికి రెండు రోజుల క్రితం ఎక్కడినుండో గుర్తు తెలియని మృత దేహం కొట్టుకువచ్చింది.. గుర్తు తెలియకపోవడంతో టెక్కలి జిల్లా హాస్పిటల్ మార్చురీలో 3రోజులు ఉంచారు.. ఆ మృతదేహం కోసం ఎవరు రాకపోవడంతో పోలీస్‌శాఖ వారు, పంచాయితీ కార్మికులతో ఖననం చేయించారు. ఈ ఖననానికి అయ్యే ఖర్చు టెక్కలి అభయం యువజన సేవా సంఘం వాళ్లు సమకూర్చారు.