GDWL: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింతగా తగ్గుముఖం పట్టింది. అదివారం ఎగువ ప్రాంతాల నుంచి 1,45,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను పైకెత్తి 99,548 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాలలో 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.