VSP: జాలరిపేటలో వేడి గంజిపడి గాయపడిన చిన్నారులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్షతగాత్రులను ఎమ్మెల్యే వంశీకృష్ణ, శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకొని చిన్నారుల ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.