VSP: ఆనందపురం మండలం పెద్దిపాలెం జాతీయ రహదారిపై శనివారం రోడ్డుప్రమాదం జరిగింది. భోగాపురం నుంచి మధురవాడకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సన్యాసమ్మ (41) అకస్మాత్తుగా కిందపడింది. తలకు తీవ్ర గాయాలవ్వగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కొమ్మాది వాసి రామసూరి భార్యగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.