GNTR: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్’ అంశంపై ఈ నెల 7న విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు శనివారం DEO రేణుక తెలిపారు. పోటీలను పాతబస్టాండ్ వద్ద ఉన్న ఉర్దూ బాలుర పాఠశాలలో నిర్వహిస్తారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు ఉంటాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రథమ బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు.