TG: నల్గొండ జిల్లాలో శ్రీగంధం చెట్లు సాగు చేసిన రైతులకు దొంగల భయం పట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ శ్రీగంధం కర్రకు రూ.5 వేల నుంచి రూ.12 వేలు పలుకుతుంది. దీంతో కొందరు దొంగలు రాత్రికి రాత్రి చెట్లను నరికివేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. ఆ దొంగలను పట్టుకోకపోతే నష్టపోతామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.