VZM: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా శనివారం ప్రారంభించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, స్దానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు ఆటోలో ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్‌కు ఆర్థిక సాయం కింద 15వేలు అందజేస్తున్నామన్నారు.