AP: 2024 వంటి ఎన్నికలను తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో ప్రజలు తమను గెలిపించారని తెలిపారు. ‘ఇప్పుడు మంచి ప్రభుత్వం మరిన్ని మంచి పనులు చేస్తోంది. 15 నెలల మా పాలనలో ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. పింఛన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చుపెడుతున్న ఏకైక ప్రభుత్వమిది’ అని పేర్కొన్నారు.