BDK: కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం 18 సెంటర్ లక్ష్మిటాక్సీ ఏరియాకు చెందిన ఓ బాలింత తనకు పుట్టిన బిడ్డను అమ్మడానికి బేరం కుదుర్చుకుంది. శనివారం విషయం తెలుసుకున్న అంగన్వాడి టీచర్స్ శ్రీదేవి, సరోజ, నీలవేణి, హెల్పర్ వెంకటలక్ష్మి పిల్లలను అమ్మడం కొనటం చట్టరీత్యా నేరమని బాలింతకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.