నెల్లూరు గ్రామీణ మండలంలోని చిన్నచెరుకూరులో వినోద్ రెడ్డికి చెందిన జీఆర్ పూజిత రైస్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులోని బాయిలర్లో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.