అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్‌కు ముందే 46 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి ఆ జట్టు స్కోర్ 66/5గా ఉంది. ఇక రెండో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 448/5 వద్ద మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.