కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంకి చెందిన సింగోతు నాగుర్ (60) శుక్రవారం వేట నిమిత్తం కాలువ దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు జారి కాలువలో పడిపోవడంతో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్సై కె. శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.