అక్టోబర్ 19 నుంచి భారత జట్టు, ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. దీనికి సంబంధించి ఈరోజు స్వ్కాడ్‌ను ప్రకటించే అవకాశముంది. అయితే, కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మతో సెలెక్టర్లు చర్చించినట్లు వార్తలొస్తున్నాయి. రోహిత్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.