NLG: గాంధీ జయంతి, విజయదశమి రోజున NLG జిల్లాలో ఓ గ్రామంలో సుక్కా, ముక్కా ముట్టలేదు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. తిప్పర్తి(M) సిలార్మియా గూడెం ప్రజలు దసరా, గాంధీ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గాంధీ జయంతి రోజున గ్రామంలో ఏ ఒక్కరూ మాంసం తినలేదు. మద్యం తాగలేదు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు జరుపుకోవడం విశేషం.