MBNR: దేవరకద్ర రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని శుక్రవారం రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు 30-35 ఏళ్ల వయసు, ఆకుపచ్చ టీషర్టు ధరించిన వ్యక్తి పట్టాల పక్కన గాయాలతో పడి ఉన్నట్లు రైల్వే ఎస్సై అక్బర్ తెలిపారు. తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలవడంతో బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.