MBNR: పాతబస్తీ, కార్వాన్ ప్రాంతంలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత నిమజ్జనోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో శుక్రవారం పాలమూరు ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి పూజలన్నీ ఫలించి, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.