ATP: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల ఖాతాల్లో నేడు రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది. అనంతపురం జిల్లాలో 9,275 మంది ఈ పథకానికి అర్హత పొందారు. రూ.13.91 కోట్ల నగదు వారి ఖాతాల్లో జమకానుంది. ఈరోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు బటన్ నొక్కి నగదు జమచేయనున్నారు.