KDP: సెంట్రల్ జైలును శుక్రవారం జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. జైలులోని సమస్యలు, వసతుల గురించి వారు ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు ప్రాయశ్చిత్తంతో పరివర్తన చెందాలని జిల్లా జడ్జి యామిని సూచించారు. ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. జైల్ నుంచి బయటికి వచ్చాక పాత జీవితం విడనాడాలని సూచించారు.