ప్రకాశం: జిల్లాలో శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించగా, ప్రకాశంకు మాత్రం మోస్తారు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.