TG: రాష్ట్ర ప్రజలు తినే ఫుడ్లో 67 శాతం అన్నమే ఉంటుందని ఓ అధ్యయనం తేల్చింది. నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం రోజూ 2 వేల క్యాలరీల ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేవలం 50 శాతం లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం మొత్తం ఫుడ్లో 70 శాతం మేర కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని వెల్లడించింది. దీంతో షుగర్, గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపింది.