KKD: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గొల్లప్రోలు బాణాసంచా తయారీ కేంద్రాలను నేడు పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తయారీ కేంద్రాల అనుమతి పత్రాలను సేఫ్టీ యంత్రాలను పరిశీలించారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా బాణాసంచా తయారు చేయడం అమ్మకాలు చేయడం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు.