KNR: శంకరపట్నం పీహెచ్సీ డాక్టర్ శ్రావణ్ ఆధ్వర్యంలో కల్వాలొ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ మహిళలకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేశ్వరి, హెల్త్ సూపర్వైజర్ అనిల్, ఏఎన్ఎంలు జ్యోతి, వనజతో ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.