ATP: అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డ్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. పండ్ల మార్కెట్లో ఈనామ్ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ నామ్ ద్వారా జరుగుతున్న చీనీ కాయల క్రయవిక్రయాలను దాని ఉపయోగాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే సంవత్సరం ప్రతిరోజు 200 టన్నుల చీనీకాయలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.