MNCL: రైతులకు మేలు చేసే వ్యవసాయ పథకాలు కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు రైతులకు నష్టం చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా పంటకు మద్దతు ధర, పంటలకు నష్టం జరిగినప్పుడు రైతులకు మేలు జరగడం లేదన్నారు.