ప్రకాశం: పామూరు పట్టణములోని సిఎస్ పురం రోడ్లో గురువారం భారతీయ జనతా పార్టీ కార్యాలయం మండలను జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపి కృషి చేస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీనివాసరావు తెలిపారు.