ప్రకాశం: వెలిగండ్ల మండల పరిధిలోని మొగులూరు గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగులూరు వస్తున్న ఆర్టీసీ బస్సును కనిగిరి నుండి వెలిగేలా వెళ్తున్న టిప్పరు సైడు ఢీకొనటంతో ఆర్టీసీ బస్సు వెనుక భాగం దెబ్బ తగిలింది. ఈ సంఘటనలో ఎవరికి ఇటువంటి ప్రమాదం జరగపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.