BPT: బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం గ్రామం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వెలమవారిపాలేనికి పది దశాబ్దాల నుంచి నైజీరియా దేశం నుంచి పక్షులు వలసవస్తాయి. సుమారు 5,312 కిలోమీటర్ల దూరం నుంచి వలస వచ్చే పక్షులు ఏటా జనవరిలో వెలమవారిపాలెం వస్తాయి. ఇక్కడ తుమ్మ చెట్లపై గూడుని ఏర్పాటు చేసుకుని నివాసం ఉండి తిరిగి వెళ్తుంటాయి.