SKLM: ఇటీవల జరిగిన మెగా డీఎస్సీ లో శ్రీకాకుళం జిల్లా నుంచి 534 మంది టీచర్లు ఎంపికయ్యారు. వీరికి నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు జిల్లాలోని విశ్వ విజేత జూనియర్ కళాశాల, గ్లోబల్ స్కూల్, గొంటి వీధి మున్సిపల్ స్కూల్స్ తో పాటు మరొక పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో రవికుమార్ తెలిపారు. ఈ ట్రైనింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.