బీజేపీపై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. బీజేపీ అమీబా లాంటిదని విమర్శించారు. బీజేపీ తనకు నచ్చిన విధంగా పొత్తులు పెట్టుకుంటుందని మండిపడ్డారు. తన పని అయిపోయిన తర్వాత పొత్తు నుంచి వెళ్లిపోతుందని ఆరోపించారు. మరోవైపు డిప్యూటీ సీఎం షిండేపై విరుచుకుపడ్డారు. ‘ఒక గాడిద పులి చర్మాన్ని ధరించింది’ అంటూ పరోక్షంగా ఆయనపై ధ్వజమెత్తారు.