KRNL: దేవరగట్టు ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది రైతులకు సంబంధించి పంటల ధరలు ఎలా ఉంటాయనే విషయాన్ని పూజారి మల్లయ్య స్వామి వివరించారు. జొన్నల ధర రూ.3,400 ఉంటుందని, పత్తి ధర రూ.7,200 వరకు పలుకుతుదని తెలిపారు. గంగమ్మ తల్లి ఉత్తర పైభాగాన కూర్చుందని పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో అధిక వర్షాలు కురుస్తాయన్నారు.