NRML: నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.