AP: కృష్ణా జిల్లా సూరంపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 50 కేజీల బరువైన 500 బస్తాలను అక్రమంగా నిల్వ చేశారు. గన్నవరం పోలీసులు, సివిల్ సప్లై అధికారులు మెరుపుదాడులు చేసి పట్టుకున్నారు. రేషన్ వ్యాపారిపై కేసు నమోదు చేశారు. అక్రమ రేషన్ రవాణాకు గన్నవరం కేంద్రంగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.