SRD: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మహాత్మా గాంధీ గడగడలాడించారని సిర్గాపూర్ మండలం పోచాపూర్ గ్రామ యువకులు తెలిపారు. గురువారం స్థానిక జీపీ వద్ద గాంధీజీ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలతో జయంతి వేడుక జరుపుకున్నారు. స్వాతంత్ర్యం సాధించిన అమరవీరుల్లో అగ్రగణ్యుడు మన జాతిపిత అని కొనియాడారు. ఇందులో అంజాగౌడ్, శంకర్ సాయిలు తదితరులు ఉన్నారు.