HYD: దుర్గం చెరువును జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు రహేజా ఐటీ పార్క్ ప్రతినిధులకు సూచనలు చేశారు. దుర్గం చెరువును రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. దుర్గం చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు.