AP: రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి, విజయ్‌ఘాట్ వద్ద లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నివాళులు అర్పించారు. తొలుత వీరంతా రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు పూలమాలతో అంజలి ఘటించారు. అనంతరం విజయ్‌ఘాట్ చేరుకుని లాల్ బహదూర్ శాస్త్రికి పుష్పాంజలి ఘటించి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.