సెప్టెంబర్ 2025లో GST వసూళ్లు రూ.1.89 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ.1.73 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాదికి 9.1 శాతం పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో నెల GST వసూళ్లు రూ.1.80 లక్షల కోట్లను దాటింది. GST సంస్కరణలు దేశీయ డిమాండ్‌ను పెంచుతాయని, దీంతో GDP వృద్ధికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.