TG: పాలిటెక్నిక్ చదివి ఉద్యోగం చేస్తున్న వారికి.. సాయంత్రం వేళ బీటెక్ చదువుకునే అవకాశాన్ని కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రక్రియ చేపట్టనుంది.