AP: విజయదశమి సెలవులపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీ వరకు మాత్రమే సెలవులు ప్రకటించి, 3వ తేదీ నుంచే క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే, ఊర్లకు వెళ్లిన వారు పండుగ రోజునే తిరిగి ప్రయాణం చేయడం సాధ్యం కాదని.. కనీసం అక్టోబర్ 4 లేదా 5 వరకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.