TTD No Ply Zone:ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం నో ప్లైయింగ్ జోన్ (No Ply Zone).. ఇక్కడ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం నిషిద్దం. ఈ రోజు 3 హెలికాప్టర్లు తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala srivari temple) పరిసరాల్లో తిరిగాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో గల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతాల్లో హెలికాప్టర్ తిరిగాయని అధికారులు గుర్తించారు. 3 హెలికాప్టర్లు (Helicopters) ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు అని.. కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల గగనతలంలో చక్కర్లు కొట్టాయని ప్రాథమికంగా గుర్తించారు.
ఆగమ శాస్త్ర నియమావళి ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్దం. విషయం తెలిసిన వెంటనే విజిలెన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. గతంలో తిరుమల కొండపై కార్చిర్చు చెలరేగింది. మంటలను ఆర్పేందుకు భారత వాయుసేన హెలికాప్టర్లను ఉపయోగించారు. ఇప్పుడు అదే ఎయిర్ ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.