»Women Brutally Killed Young Man With Stone In Jaipur Mandal Mancherial District
Mancherialలో దారుణం.. Young Boyని నడి రోడ్డుపై రాయితో కొట్టి చంపిన మహిళ
తన ఇంటి ముందే ఆమె నివసిస్తుండడంతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది భరించలేక ఆమె భర్త గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటిని తాళలేక ఆమె మహేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెళ్లయినా వదలలేదు.. భర్త ఉన్నా కూడా ఆ యువకుడు (Young Boy) వివాహితను వేధించడం మొదలుపెట్టాడు. ప్రేమ (Love) పేరుతో వేధింపులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఆమె భర్త (Husband) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది జరిగి ఏడాదైనా ఆ యువకుడిలో మార్పు లేదు. అతడి వేధింపులు తీవ్రమవడంతో ఇక ఆమె సహించలేకపోయింది. ఆ యువకుడిని కుటుంబసభ్యులతో కలిసి ఆ యువకుడిని అంతమొందించింది. నడిరోడ్డుపైనే ఆ యువకుడిని రాయి కొట్టి దారుణంగా హత్య (Killed) చేశారు. ఈ సంఘటన తెలంగాణలోని (Telangana) మంచిర్యాల జిల్లాలో (Mancherial District) జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా జైపూర్ (Jaipur) మండలం ఇందారంలో యువకుడు మహేశ్ (28) (Mahesh) ఓ వివాహితను వేధిస్తున్నాడు. ప్రేమ పేరుతో తరచూ వేధిస్తున్నాడు. తన ఇంటి ముందే ఆమె నివసిస్తుండడంతో వేధింపులకు (Harrassment) పాల్పడుతున్నాడు. ఇది భరించలేక ఆమె భర్త గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటిని తాళలేక ఆమె మహేశ్ పై పోలీసులకు (Police) ఫిర్యాదు చేసింది. ఆ యువకుడిలో ఎలాంటి మార్పు రాలేదు. స్టేషన్ కు వెళ్లొచ్చినా అతడి ప్రవర్తన, ఆగడాలు తగ్గలేదు. దీంతో మహేశ్ ను అంతమొందించాలని ఆమె నిర్ణయించుకుంది.
కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఉదయం మహేశ్ ను ఆమె అడ్డగించింది. అక్కడే ఉన్న రాయితో (Stone) బాదేసింది. కుటుంబీకులు, బంధువులతో కలిసి రాళ్లతో ఆ యువకుడుని దారుణంగా హత్య చేశారు. పట్టపగలు.. నడిరోడ్డుపై ఈ ఘోరం జరుగుతున్నా చుట్టూ పక్కల జనం, స్థానికులు చూస్తుండి పోయారు. ఆ దారుణాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారంతా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. కాగా, దారుణ హత్యకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారింది.