విరూపాక్ష(Virupaksha) బంపర్ హిట్ కొట్టింది. ఊహించని రీతిలో సినిమా విజయం సాధించడంతో.. చిత్ర బృందం మొత్తం సంబరాలు చేసుకుటోంది. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik dandu) పేరు మార్మోగిపోతోంది. కొత్త డైరెక్టర్ అయినా, ఎక్కడా తడపడకుండా అతను సినిమా తీసిన విధానికి అందరూ ఫిదా అయిపోతారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటి నుంచి.. ఈ కొత్త డైరెక్టర్ కార్తీక్, సుకుమార్ కి శిష్యుడు అంటూ ప్రచారం జరిగింది. అయితే.. అందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా తెలిసింది.
కార్తీక్ దండు(Karthik dandu) తన మొదటి సినిమా భంభోలేనాథ్ తో దర్శకుడు అయ్యాడు. అయితే ఆ సినిమా ఊహించినంత హిట్ కాలేదు. దీంతో, ఈ విరూపాక్ష కథ రాసుకొని దానికోసం ప్రొడ్యూసర్ ల వెంట తిరుగుతూ ఉన్నాడట. ఆ సమయంలో ఓ నిర్మాత దొరికితే, అతనికి కథ వివరించాడు. ఆ నిర్మాత కాస్త.. డైరెక్టర్ సుకుమార్ కి స్నేహితుడట. దీంతో, ఈ కథ సుకుమార్(Sukumar) దగ్గరకు చేరింది. కథ విని ఇంప్రెస్ అయిన సుకుమార్, స్క్రిప్ట్ రాయడానికి సహాయం చేశాడు. అలానే నిర్మాణంలోనూ భాగమయ్యాడు. సినిమాలోని కొన్ని ట్విస్ట్ ల సలహా సుకుమార్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్ కీలక సలహాలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి సుకుమార్ సహాయంతో కార్తీక్ దండు హిట్ కొట్టేశాడు.