»Video Viral Anushka Sharma And Virat Kohli Dance In The Gym
Video Viral : జిమ్‌లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ స్టెప్పులు..!
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో స్టెప్పులేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనుష్క శర్మ(Anushka Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) జిమ్‌లో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వీరిద్దరూ ఓ పంజాబీ పాటకు స్టెప్పులేశారు. అనుష్క, కోహ్లీ వేర్వేరు వృత్తుల్లో బిజీగా ఉన్నా ఫ్యాన్స్‌తో మాత్రం టచ్‌లో ఉంటారు. ఎప్పుడు ఎక్కడికెళ్లినా కూడా తమ ఫోటోలు, వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా జిమ్‌లో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జిమ్‌లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ స్టెప్పులు వేసిన వీడియో:
అనుష్క, విరాట్లు జిమ్‌లోకి కూల్‌గా ఎంట్రీ ఇచ్చి పంజాబీ ఆర్టిస్ట్ శుభ్ ఎలివేటెడ్ సాంగ్‌కు స్టెప్పులేవారు. వీరిద్దరూ పోటీపడి స్టెప్పులు వేయగా అందులో కోహ్లీ మాత్రం డ్యాన్స్ కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ వీడియోను అనుష్క తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. తను షేర్ చేసిన పోస్ట్‌కు ‘డ్యాన్స్ పే ఛాన్స్ స్కిల్స్’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది.
విరుష్క జంట కాస్త ఫ్రీ టైమ్ దొరికితే చాలు లంచ్ డేట్‌కి వెళ్లడం, జిమ్‌కి కలిసి వెళ్లడం, సందర్శనీయ ప్రదేశాలు తిరగడం వంటివి చేస్తుంటారు. తాజాగా బెంగళూరులోని శ్రీసాగర్ సెంట్రల్ టిఫిన్ రూమ్ రెస్టారెంట్‌కు కూడా కలిసి వెళ్లారు. ఇటీవలే కోహ్లీ కూడా తామిద్దరం ముంబైలో డియోర్ ప్రీ ఫాల్ షోకు వెళ్లిన ఫోటోను కూడా నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.